ఇకనైన కానీ ఇప్పుడైన కానీ

ఇకనైన కానీ ఇప్పుడైన కానీ

బైబిల్ సందేశం: “ఇకనైనా కానీ, ఇప్పుడైనా కానీ”

మన జీవితంలో ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని రోజులు దేవునికి దూరంగా ఉన్నా, ఆయన ప్రేమ మనల్ని విడిచిపెట్టదు. మనం మారాలని నిర్ణయించుకునే సమయం ఎప్పుడైనా కావచ్చు. కానీ దేవుని వైపు తిరిగి రావడానికి ఇప్పుడే సరైన సమయం.

బైబిల్‌లో ఇలా ఉంది:

“ఇదిగో, ఇప్పుడే అనుకూల సమయం; ఇదిగో, ఇప్పుడే రక్షణ దినము.” — 2 కొరింథీయులకు 6:2

ప్రియమైన సహోదరులారా, రేపు మారుదామని వాయిదా వేయకండి. ఇప్పుడే యేసయ్యను ప్రార్థించండి. మీ కన్నీళ్లను ఆయన చూస్తున్నారు, మీ బాధను ఆయన ఎరుగును. పశ్చాత్తాపంతో ఆయన దగ్గరకు రండి. ఆయన కృప మీకు నూతన జీవితాన్ని ఇస్తుంది.

చిన్న ప్రార్థన: యేసయ్యా, ఇంతకాలం నీకు దూరంగా ఉన్న నన్ను క్షమించు. ఇకనైనా కాదు, ఇప్పుడే నీతో నడిచే జీవితాన్ని నాకు అనుగ్రహించు. ఆమేన్. 🙏

Song Details

Language: Telugu

Category: Christian

ఇకనైన కానీ ఇప్పుడైన కానీ Lyrics

ఇకనైన కానీ ఇప్పుడైన కానీ
దర్శించగా రావా
అభిషేకం లేక దర్శనము రాక
నశియించుచున్నానయ్యా (2)

కావలివాడు ఉదయం కోసం
మెలుకువ కలిగి చూచునట్లుగా (2)
నీ కోసం చూసానయ్యా – నా యేసయ్యా
నా జీవం నీవేనయ్యా (4)

ఎండిన నేల వర్షం కోసం
నేలను విరచి చూచునట్లుగా (2)
నీ కోసం చూసానయ్యా – నా యేసయ్యా
నా జీవం నీవేనయ్యా (4)

దుప్పి నీటి వాగుల కొరకు
ఇలలో ఎదురు చూచునట్లుగా (2)
నీ కోసం చూసానయ్యా – నా యేసయ్యా
నా జీవం నీవేనయ్యా (4)