ఆధారం నాకు ఆధారం

ఆధారం నాకు ఆధారం

మన జీవితంలో ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, నిరాశలు ఎదురైనా మనల్ని విడిచిపెట్టని దేవుడు యేసుక్రీస్తు. మనుషులు మనల్ని విడిచిపెట్టవచ్చు, మన బలం తగ్గిపోవచ్చు, కానీ దేవునిపై మనకున్న విశ్వాసం మనల్ని ముందుకు నడిపిస్తుంది. కష్టకాలంలో ఆయనను ఆశ్రయించినప్పుడు మన హృదయానికి ధైర్యం, మన ఆత్మకు ఆదరణ లభిస్తాయి. కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నా భయపడకండి. యేసయ్యను మీ ఆధారంగా చేసుకోండి. ఆయనే మీ బలం, మీ ఆశ్రయం, మీ జీవితానికి నిజమైన ఆధారం.

📖 బైబిల్ వచనం:

“దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు; ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు.”

Song Details

Language: Telugu

Category: Christian

ఆధారం నాకు ఆధారం Lyrics

ఆధారం నాకు ఆధారం
నాకు తోడునీడై ఉన్న నీ కృపయే ఆధారం
ఆశ్రయమూ నాకు ఆశ్రయమూ
ఆపత్కాలమందు ఆశ్రయమూ నీ నామం ఆశ్రయమూ
తల్లితండ్రి లేకున్నా – బంధుజనులు రాకున్నా
లోకమంత ఒకటైనా – బాధలన్ని బంధువులైనా ||ఆధారం||

భక్తిహీన బంధంలో నేనుండగా
శ్రమల సంద్రంలో పడియుండగా (2)
ఇరుకులో విశాలతనూ కలిగించిన దేవా (2)
నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా (2) ||ఆధారం||

దారిద్ర్యపు సుడినుండి ఐశ్యర్యపు తీరానికి
నీ స్వరమె నా వరమై నడిపించిన యేసయ్యా (2)
విడువను ఎడబాయనని పలికిన నా దేవా (2)
నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా (2) ||ఆధారం||

దిగులుపడిన వేళలలో దరిచేరిన దేవా
అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా (2)
చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా (2)
నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా (2) ||ఆధారం||

Read More Lyrics