ఈ జీవితం విలువైనది

Song Writer: సత్యవేద సాగర్

ఈ జీవితం విలువైనది

నరులారా రండని సెలవైనది (2)

సిద్ధపడినావా చివరి యాత్రకు

యుగయుగాలు దేవునితో ఉండుటకు

నీవుండుటకు           ||ఈ జీవితం||


సంపాదన కోసమే పుట్టలేదు నీవు

పోయేటప్పుడు ఏదీ పట్టుకొని పోవు (2)

పోతున్నవారిని నువు చుచుటలేదా (2)

బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా (2)    ||ఈ జీవితం||


మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు

కలకాలమీ లోకంలో ఉండే స్థిరుడెవడు (2)

చిన్న పెద్ద తేడా లేదు మరణానికి (2)

కులమతాలు అడ్డం కాదు స్మశానానికి (2)    ||ఈ జీవితం||


పాపులకు చోటు లేదు పరలోకమునందు

అందుకే మార్పుచెందు మరణానికి ముందు (2)

యేసు రక్తమే నీ పాపానికి మందు (2)

కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు (2)    ||ఈ జీవితం||



ఈ జీవితం విలువైనది