అదే అదే ఆ రోజు
“అదే అదే ఆ రోజు”అనే పాటలోని భావానికి అనుగుణంగా, ప్రభువు రాకడను గుర్తుచేసే చిన్న బైబిల్ సందేశం:
✝️ చిన్న బైబిల్ సందేశం
“అదే ఆ రోజు… ప్రభువు యేసుక్రీస్తు మహిమతో తిరిగి వచ్చే రోజు. ఆ రోజు కోసం మనం సిద్ధంగా ఉన్నామా?
మనకు ఆ రోజు ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ యేసు ప్రభువు తన రాకడ గురించి ముందుగానే హెచ్చరించాడు. కాబట్టి ఈ లోక విషయాల్లోనే మునిగిపోకుండా, పరిశుద్ధమైన జీవితంతో, విశ్వాసంతో, ప్రార్థనతో ప్రభువును ఎదురుచూడాలి.
📖 “కావున మీరు సిద్ధపడి ఉండుడి; మీకు తోచని గడియలో మనుష్యకుమారుడు వచ్చును.” మత్తయి 24:44
ఆ రోజు భయపడే రోజుగా కాకుండా, ప్రభువును ప్రేమించినవారికి ఆనందకరమైన కలయిక రోజుగా ఉండాలి. ❤️✝️
అదే అదే ఆ రోజు - Ade Ade Aa roju Lyrics
అదే అదే ఆ రోజు
యేసయ్య ఉగ్రత రోజు
ఏడేండ్ల శ్రమల రోజు
పాపులంతా ఏడ్చే రోజు ||అదే అదే||
వడగండ్లు కురిసే రోజు
భూమి సగం కాలే రోజు (2)
నక్షత్రములు రాలే రోజు
నీరు చేదు అయ్యే రోజు
ఆ నీరు సేవించిన
మనుషులంతా చచ్చే రోజు ||అదే అదే||
సూర్యుడు నలుపయ్యే రోజు
చంద్రుడు ఎరుపయ్యే రోజు (2)
భూకంపం కలిగే రోజు
దిక్కు లేక అరచే రోజు
ఆ రోజు శ్రమ నుండి
తప్పించే నాథుడు లేడు ||అదే అదే||
మిడతల దండొచ్చే రోజు
నీరు రక్తమయ్యే రోజు (2)
కోపాగ్ని రగిలే రోజు
పర్వతములు పగిలే రోజు
ఆ రోజు శ్రమ నుండి
తప్పించే నాధుడు లేడు ||అదే అదే||
వ్యభిచారులు ఏడ్చే రోజు
మోసగాళ్ళు మసలే రోజు (2)
అబద్ధికులు అరచే రోజు
దొంగలంతా దొరికే రోజు
ఆ రోజు శ్రమ నుండి
తప్పించే నాథుడు లేడు ||అదే అదే||
పిల్ల జాడ తల్లికి లేక
తల్లి జాడ పిల్లకు లేక (2)
చేట్టుకొక్కరై పుట్టకొక్కరై
అనాథలై అరచే రోజు
ఆ రోజు శ్రమ నుండి
తప్పించే నాథుడు లేడు ||అదే అదే||
ఓ మనిషి యోచింపవా
నీ బ్రతుకు ఎలా ఉన్నదో (2)
బలము చూసి భంగ పడకుమా
ధనము చూసి దగా పడకుమా
ఆ రోజు శ్రమ నుండి
తప్పించే నాథుడు లేడు ||అదే అదే||
యేసయ్య ఉగ్రత రోజు
ఏడేండ్ల శ్రమల రోజు
పాపులంతా ఏడ్చే రోజు ||అదే అదే||
వడగండ్లు కురిసే రోజు
భూమి సగం కాలే రోజు (2)
నక్షత్రములు రాలే రోజు
నీరు చేదు అయ్యే రోజు
ఆ నీరు సేవించిన
మనుషులంతా చచ్చే రోజు ||అదే అదే||
సూర్యుడు నలుపయ్యే రోజు
చంద్రుడు ఎరుపయ్యే రోజు (2)
భూకంపం కలిగే రోజు
దిక్కు లేక అరచే రోజు
ఆ రోజు శ్రమ నుండి
తప్పించే నాథుడు లేడు ||అదే అదే||
మిడతల దండొచ్చే రోజు
నీరు రక్తమయ్యే రోజు (2)
కోపాగ్ని రగిలే రోజు
పర్వతములు పగిలే రోజు
ఆ రోజు శ్రమ నుండి
తప్పించే నాధుడు లేడు ||అదే అదే||
వ్యభిచారులు ఏడ్చే రోజు
మోసగాళ్ళు మసలే రోజు (2)
అబద్ధికులు అరచే రోజు
దొంగలంతా దొరికే రోజు
ఆ రోజు శ్రమ నుండి
తప్పించే నాథుడు లేడు ||అదే అదే||
పిల్ల జాడ తల్లికి లేక
తల్లి జాడ పిల్లకు లేక (2)
చేట్టుకొక్కరై పుట్టకొక్కరై
అనాథలై అరచే రోజు
ఆ రోజు శ్రమ నుండి
తప్పించే నాథుడు లేడు ||అదే అదే||
ఓ మనిషి యోచింపవా
నీ బ్రతుకు ఎలా ఉన్నదో (2)
బలము చూసి భంగ పడకుమా
ధనము చూసి దగా పడకుమా
ఆ రోజు శ్రమ నుండి
తప్పించే నాథుడు లేడు ||అదే అదే||