కళ్ళల్లో కన్నీరు ఎందుకూ - Kallallo Kanneerenduku

కళ్ళల్లో కన్నీరు ఎందుకూ

 కళ్ళల్లో కన్నీరు ఎందుకు?

కళ్ళల్లో కన్నీరు వచ్చినప్పుడు మన బాధను అందరూ అర్థం చేసుకోకపోవచ్చు. కానీ మన ప్రతి కన్నీటిని దేవుడు చూస్తాడు, మన ప్రతి వేదనను ఆయన తెలుసుకుంటాడు.

“నా సంచారమంతయు నీవు లెక్కించితివి; నా కన్నీళ్లను నీ తిత్తిలో ఉంచుము.”

— కీర్తనలు 56:8

మనుషులు మనలను విడిచిపెట్టినా, దేవుడు మనలను విడిచిపెట్టడు. ఈ రోజు నీ కళ్ళల్లో కన్నీరు ఉండవచ్చు… కానీ రేపు అదే కళ్ళల్లో ఆనందం నింపగల శక్తి యేసుక్రీస్తుకు ఉంది.

నీ కన్నీళ్లను దాచుకోకు… వాటిని యేసు పాదాల దగ్గర ఉంచు. ఆయన నీ బాధను ఆనందంగా మార్చగలడు.*❤️🙏

Song Details

Singer: Atchyuth

Music Director: George Sambathini

Lyricist: George Sambathini

Language: Telugu

Category: Christian

కళ్ళల్లో కన్నీరు ఎందుకూ - Kallallo Kanneerenduku Lyrics

కళ్ళల్లో కన్నీరు ఎందుకూ
గుండెల్లో దిగులు ఎందుకూ
ఇక నీవు కలతచెందకూ
నెమ్మది లేకుందా
గుండెల్లో గాయమైనదా
ఇక అవి ఉండబోవుగా
యేసే నీ రక్షణ...యేసే నీ నిరీక్షణ
యేసే నీ రక్షణ.యేసే నీ నిరీక్షణ |కళ్ళల్లో|

1. హొరు గాలులూ వీచగా...తుఫానులు చెలరెగగా
మాట మాత్రం సెలవియ్యగ నిమ్మళమయెనుగా|2|
యేసే నీ నావిక భయము చెందకూ నీవు ఇక..
యేసే నీ రక్షక..కలత చెందకూ నీవు ఇక |కళ్ళల్లో|

2. కరువు ఖడ్గములు వచ్చినా...నింద వేదన చుట్టినా
లోకమంత ఏకమైనా భయము చెందకుమా|2|
యేసే నీ రక్షక...దిగులు చెందకూ నీవు ఇక
యేసే విమోచక..సంతసించుము నీవు ఇక |కళ్ళల్లో