ఆధారం నీవే యేసయ్యా
పల్లవి:- ఆధారం నీవే యేసయ్యా
ఆనందం నీవే మెస్సయ్యా "2"
నా తల్లియూ నీవే నా తండ్రి యు నీవే
నాకున్నది నీవే నేనున్నది నీకే
ఆధారం ... నా ఆనందం నా కభయం
దేవా ప్రతి దినం "2" ఆధారం"
1. బంధువు లే నన్ను బాధ పరచిన
ఆత్మీయులే నన్ను ఆధరించకపోయినా. "2"
కన్నుల్లో కన్నీరు కదులుతూనే వున్న
హృదయం లో కలహాలు కుదురులేక చేస్తున్న"2"
ఆధారం"
2. అశాంతి నాలో నిలువునా అలుము కుంటున్నా
ఎవరున్నారు నీకని హృదయం ప్రశ్నిస్తున్నా "2"
భవిష్యత్తే నాలో భయమే రేపుతున్న
బరువైన హృదయం తో నీకై బ్రతుకుతున్న "2"
ఆధారం" ఆధారం నీవే యేసయ్యా