ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం

Song Writer:పండు ప్రేమ్ కుమార్

ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం

ఇది లోక కళ్యాణం

మేరి పుణ్యదినం – (2)


రాజులనేలే రారాజు వెలసె పశువుల పాకలో

పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో

భయము లేదు మనకిలలో

జయము జయము జయమహో       ||ఇది||


గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయ భక్తితో

పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో

జయనాదమే ఈ భువిలో

ప్రతిధ్వనించెను ఆ దివిలో       ||ఇది||



ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం