ఉదయించె దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున

Song Writer:సీయోను గీతాలు

ఉదయించె దివ్య రక్షకుడు

ఘోరాంధకార లోకమున

మహిమ క్రీస్తు ఉదయించెను

రక్షణ వెలుగు నీయను – (2)      ||ఉదయించె||


ఘోరాంధకారమున దీపంబు లేక

పలు మారు పడుచుండగా (2)

దుఃఖ నిరాశ యాత్రికులంతా

దారి తప్పియుండగా (2)

మార్గదర్శియై నడిపించువారు (2)

ప్రభు పాద సన్నిధికి

దివ్య రక్షకుడు ప్రకాశ వెలుగు

ఉదయించె ఈ ధరలో – (3)       ||ఉదయించె||


చింత విచారముతో నిండియున్న

లోక రోదన విని (2)

పాపంబునుండి నశించిపోగా

ఆత్మ విమోచకుడు (2)

మానవాళికై మరణంబునొంది (2)

నిత్య జీవము నివ్వన్

దివ్యరక్షకుడు ప్రకాశతార

ఉదయించె రక్షింపను – (3)       ||ఉదయించె||


పరలోక తండ్రి కరుణించి మనల

పంపేను క్రీస్తు ప్రభున్ (2)

లోకాంధులకు దృష్టినివ్వ

అరుదెంచె క్రీస్తు ప్రభువు (2)

చీకటి నుండి దైవ వెలుగునకు (2)

తెచ్చె క్రీస్తు ప్రభువు

సాతాను శృంగలములను తెంప

ఉదయించె రక్షకుడు – (3)       ||ఉదయించె||



ఉదయించె దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున