కయీనుకు ఇచ్చినా అవకాశమే దేవుడు నీకు ఇస్తున్నాడు.. నీ బ్రతుకు మార్చు కుంటావా?

ఒకని హృదయంలో కోపము, పాపము ఉన్నప్పుడు వాడు సాతాను సంబంధి. అలాంటి వారితో సాతను నీచమైన తుంటరి పనులు చేయిస్తాడు. కయీను జీవితంలో కచ్చితంగా అదే జరిగింది. అతని హృదయంలో పాపం ఉంది కాబట్టే తన తమ్ముడు (హేబేలు)ను చంపాడు. అయినా సరే కయీనును దేవుడు ఎంతగానో ప్రేమించాడు కాబట్టే.. నీకు కోపమేల? సమాధాన పడుమని హెచ్చరించెను. అయినను తమ్మునితో సమాధానపడని కయీను చివరికి అతనిని చంపివేసెను.

ఒకని హృదయంలో కోపము, పాపము ఉన్నప్పుడు వాడు సాతాను సంబంధి. అలాంటి వారితో సాతను నీచమైన తుంటరి పనులు చేయిస్తాడు. కయీను జీవితంలో కచ్చితంగా అదే జరిగింది. అతని హృదయంలో పాపం ఉంది కాబట్టే తన తమ్ముడు (హేబేలు)ను చంపాడు. Caine and aubel, Bible stories, christ news

ఒకని హృదయంలో కోపము, పాపము ఉన్నప్పుడు వాడు సాతాను సంబంధి. అలాంటి వారితో సాతను నీచమైన తుంటరి పనులు చేయిస్తాడు. కయీను జీవితంలో కచ్చితంగా అదే జరిగింది. అతని హృదయంలో పాపం ఉంది కాబట్టే తన తమ్ముడు (హేబేలు)ను చంపాడు. అయినా సరే కయీనును దేవుడు ఎంతగానో ప్రేమించాడు కాబట్టే.. నీకు కోపమేల? సమాధాన పడుమని హెచ్చరించెను. అయినను తమ్మునితో సమాధానపడని కయీను చివరికి అతనిని చంపివేసెను.

నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ?  అని దేవుడు అడిగినప్పుడైనా కయీను పశ్చాత్తాపపడి, ‘నేను నా తమముని చంపిశాను, నేను దోషిని’ అని ఒప్పుకొనక, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా?’ అని దేవునితో వ్యాజ్యెమాడుచున్నాడు. తమ తప్పును ఒప్పుకొనుటకు ఇష్టము లేనివారు గొడవలకు, ఘర్షణలకు దిగుతారు. ‘‘పాపము  చేయలేదని నీవు చెప్పిన దానిబట్టి నీతో నాకు వ్యాజ్యెము కలిగినది’’ (యిర్మీయా 2:5) అని ప్రభువు అంటున్నాడు.

దేవునితో వ్యాజ్యెమాడుట భయంకరం! మన  తప్పును సమర్ధించుకొనుట, తప్పును ఒప్పుగా నిరూపించుటకై వాదించుట బహు భయంకరము! మన  తప్పును సమర్థించుకొనుట, మన  పాపమును మనము కప్పుకొనక, ఒప్పుకొనుట మేలు! ఎందుకంటే.. ‘‘మన  పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన  నమ్మదగినవాడును, నీతిమంతుడును గునుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులునుగా చేయును’’ (1 యోహాను 1:9). అయితే కయీను క్షమించగలిగిన ప్రభువునే ఎదరించి, ప్రేమించే ఆయన కౌగిలిలోనికి చేరక, ఆయన హెచ్చరికలను తృణీకరించి, ఆయనిచ్చిన అవకాశాలను జారవిడిచెను. కనుక కఠినమైన తీర్పు, భరించలేని శిక్ష అతనిపైకి వచ్చెను.

‘‘కావున  నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన యీ నేలమీద ఉండకుండ, నీవు శపింపబడినవాడవు, నీవు నేలను సేద్యపరచునప్పుడు అది తన  సారమును ఇకమీదట నీకియ్యదు.  నీవు భూమిమీద దిగులుపడుచు దేశదిమ్మరివై యుందువనెను’’ (ఆది 4:11,12) అప్పుడు కయీను - ‘నా దోషశిక్ష నేను భరించలేనంత గొప్పది’ అని గోల పెట్టెను.  గాని, ఆ శిక్షను తప్పించుకొనే మార్గము అతనికి దొరకలేదు. చద్దునేమోయని భయపడెనే గాని, దేశదిమ్మరియై తిరుగటకు సిగ్గుపడలేదు.

ఆదాము, హవ్వల ప్రథమ ఫలముగా, దేవుడు చేసిన  సకలసృష్టిని పరిపాలించుటకు బదులు, నెమ్మది లేనివడిగా తన బ్రతుకంతా దేశదిమ్మరియై తిరిగెను. తన హృదయమును అనుసరించి న్యాయపు తీర్పు దినమందు తనకు తాను ఉగ్రతను సమకూర్చుకొనెను.  గనుక మనము కయీను వంటివారమై యుండరాదు.  వాడు దుష్టుని సంబంధియై తన  సహోదరుని చంపెను, వాడతనిని ఎందుకు చెంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతిగలవియునై యుండెను  గనుకనే గదా? (యోహాను 3:12).

కాబట్టి ప్రియ చదువరీ! నీ హృదయములో ఎవరిపైనను ద్వేషమును, కోపమును ఉంచుకొనక, ఎప్పటికప్పుడు నీ కోపమును ఒప్పుకొని, ఇతరులతో సమాధానపడుము! ‘‘కోపపడుడి గాని పాపము చేయకుండి, సూర్యడస్తమించు వరకు నీ కోపము నిలిచియుండకూడదు’’ (ఎఫెసీ 4:26) అని బైబిలు సెలవిస్తుంది. ప్రేమతో కోపమును చంపివేయుడి, యేసయ్య కల్వరి సిలువ యొద్ద మనకు కావలసినంత ప్రేమ దొరుకుతుంది. నీ హృదయములో ద్వేషము తలెత్తినప్పుడు, నీవు మోకాళ్ళూని యేసుప్రభువు యొక్క సిలువను ధ్యానము చేయి! అంతే, ఆయన కల్వరి ప్రేమధారలు నీ హృదయాన్ని నింపుతాయి! అప్పుడు నీవు నిన్ను ద్వేషించువారిని, హింసించువారిని కూడ ప్రేమించగలుగుతావు!.

ఇది చదువుతున్న నీలో కయీను బుద్ధి వున్నట్లైతే..  జీవితాన్ని నాశనం  చేసుకొనకమునుపే ఈ క్షణమే  దేవునితో సమాధానపడితే ఎంత బాగుండు! ఒక విషయం గుర్తుపెట్టుకోండి... ఎదురించేతత్వం మనిషి గుల్ల చేసిపడేస్తుందని చెప్పడానికి కయీనే మనకు ఒక నిదర్శనం. నీ ఇంటివారిపై, నీ స్నేహితులపై, నీ తోటివారిపై ఎగిరిగంతులు వేస్తున్నావా? అయితే ఆ ఎగురుడును ఈక్షణమే దించుకుంటే మంచిది. లేకపోతే తిప్పలు కొనితెచ్చుకోక తప్పదు.