నిన్నే నే నమ్ముకున్నాను

నిన్నే నే నమ్ముకున్నాను


Singer Paul Moses and Asha Ashirwadh
Composer
Music Sareen Imman
Song WriterPaul Moses and Asha Ashirwadh


నిన్నే నే నమ్ముకున్నాను
నీవంటి వారు ఎవరయ్యా
నిన్నే నే నమ్ముకున్నాను
నీవంటి వారు లేరయ్యా(2)
అద్భుతం చేయుమయా
నా జీవితంలో
నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య.(2)
|| నిన్నే నే ||


నీవే ఏదైనా చెయ్యలంటూ
నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను(2)
తప్పక చేస్తావని నిన్ను నమ్మి(2)
నీ కరముపై దృష్టి వుంచినానయ్యా(2)
||అద్బుతం చేయుమయా ||
|| నిన్నే నే ||


నిందలు అవమానాలు సహించుకుంటూ
నీ రెక్కల నీడనే ఆశ్రయించాను(2)
నీ వాగ్ధానములను చేతపట్టి(2)
నీ ముఖముపై దృష్టివుంచి నానయ్యా(2)
||అద్బుతం చేయుమయా ||
|| నిన్నే నే ||



నిన్నే నే నమ్ముకున్నాను