క్రొత్త యేడు మొదలు బెట్టెను మన బ్రతుకు నందు

క్రొత్త యేడు మొదలు బెట్టెను మన బ్రతుకు నందు

Singer
Composer
Music
Song Writerఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

క్రొత్త యేడు మొదలు బెట్టెను మన బ్రతుకు నందు

క్రొత్త యేడు మొదలు బెట్టెను

క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త యేట ప్రభుని సేవ

తత్తర పడకుండ జేయు టుత్తమొత్తమంబు జూడ ||క్రొత్త||

పొందియున్న మేలులన్నియు బొంకంబు మీర

డెందమందు స్మరణ జేయుడి

ఇందు మీరు మొదలుపెట్టు పందెమందు గెల్వ వలయు

అందముగను రవిని బోలి అలయకుండా మెలయకుండా ||క్రొత్త||

బలము లేని వారమయ్యీను బలమొందవచ్చు

కలిమి మీర గర్త వాక్కున

అలయకుండా అడుగుచుండ నలగకుండా మోదమొంది

బలమొసంగు సర్వ విధుల నెలమి మీర నొచ్చుచుండ ||క్రొత్త||

పాప పంకమంటినప్పుడు ప్రభు క్రీస్తు యేసు

ప్రాపు జేరి మీరు వేడగా

సేపు మీర తనదు కరుణ పాపమంతా కడిగివేసి

పాప రోగ చిహ్నలన్ని బాపి వేసి శుద్ది చేయు ||క్రొత్త||

క్రొత్త యేడు మొదలు బెట్టెను మన బ్రతుకు నందు