అంకితం ప్రభూ నా జీవితం

అంకితం ప్రభూ నా జీవితం

అంకితం ప్రభూ నా జీవితం - నీ చరణాల సేవకే అంకితమయ్యా - 2 నీ సేవకై ఈ సమర్పణా - అంగీకరించుము నాదు రక్షకా - 2 1. మోడుబారిన నా జీవితం - చిగురింపజేసావు దేవా నిష్ఫలమైన నా జీవితం - ఫలియింపజేసావు ప్రభువా నీ కృపలో బహుగా ఫలించుటకు - ఫలింపని వారికి ప్రకటించుటకు - 2 అంగీకరించుము నా సమర్పణ 2. కారు చీకటి కాఠిన్య కడలిలో - నీ కాంతినిచ్చావు దేవా చీకటిలోనున్న నా జీవితం - చిరుదివ్వెగా చేసావు ప్రభువా నీ సన్నిధిలో ప్రకాశించుటకు - అంధకార ఛాయలను తొలగించుటకు - 2 అంగీకరించుము నా సమర్పణ
Labels: Lyrics