అంతము సమీపమైయున్నది

అంతము సమీపమైయున్నది

Lyricist: KVS SONGS
అంతము సమీపమైయున్నది దేవుని తీర్పు రానున్నది అ.ప. ఈ యుగము ముగింపబడుచున్నది నీవు సిద్ధపడి యున్నావా కాలము బహు కొంచమే ఉన్నది నీవు సిద్ధపడి యున్నావా నీ ఆత్మ సిద్ధపరచుకున్నావా 1. లోకపు నటనను ధరియించి వేషధారిగా ఉంటివా పైకి భక్తిగల వాడై దేవుని శక్తిని ఆశ్రయించవా మారుమనస్సే లేనిచో క్షమాపణే లేదని గ్రహించుచున్నావా కాలమే కొంచెము సమయమే లేదని గ్రహించుచున్నావా 2. పరిశుద్ధాత్మను కలిగుండి నీవు నడచుచుంటివా నీ జీవము దేవుని యందు భద్రపరచియుంటివా పరిశుద్ధాత్మయే లేనిచో పరలోకమే లేదని గ్రహించుచున్నవా కాలమే కొంచెము సమయమే లేదని గ్రహించుచున్నావా 3. సత్యము గూర్చిన జ్ఞానమును నీవు కలిగియుంటివా ప్రత్యక్షతను పొందక సత్యమునే ఎదురింతువా సత్యమే లేనిచో నిత్యజీవమే లేదని గ్రహించుచున్నావా కాలమే కొంచెము సమయమే లేదని గ్రహించుచున్నావా
Labels: Lyrics