అందరు నన్ను విడచినా
మన జీవితంలో కొన్నిసార్లు మనకు అత్యంత ఇష్టమైనవారు కూడా మనల్ని విడిచిపెట్టవచ్చు. మన బాధను అర్థం చేసుకునేవారు ఎవరూ లేరని అనిపించవచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి: అందరూ మనల్ని విడిచినా, యేసయ్య మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు.
“నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను” అని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. (హెబ్రీయులకు 13:5)
మనుషులు మనల్ని విడిచిపెట్టవచ్చు, కానీ దేవుని ప్రేమ ఎప్పటికీ మారదు. కాబట్టి ఒంటరిగా ఉన్నామని నిరాశపడకండి. మీ కన్నీళ్లను చూసే దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఆయనపై విశ్వాసంతో ముందుకు సాగండి.
చిన్న ప్రార్థన: ప్రభువా, అందరూ నన్ను విడిచినా నీవు నాతో ఉన్నావని నమ్మే విశ్వాసాన్ని నాకు దయచేయుము. ఆమేన్.
Song Details
Singer: Jayasudha
Music Director: టోని ప్రకాష్
Language: Telugu
Category: Christian
అందరు నన్ను విడచినా Lyrics
అందరు నన్ను విడచినా
నీవు నన్ను విడువనంటివే (2)
నా తల్లియు నీవే
నా తండ్రియు నీవే
నా తల్లి తండ్రి నీవే యేసయ్యా (2)
1. లోకము నన్ను విడచినా
నీవు నన్ను విడువనంటివే (2)
నా బంధువు నీవే
నా మిత్రుడ నీవే
నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా (2)
2. వ్యాధులు నన్ను చుట్టినా
బాధలు నన్ను ముట్టినా (2)
నా కొండయు నీవే
నా కోటయు నీవే
నా కొండ కోట నీవే యేసయ్యా (2)
3. నేను నిన్ను నమ్ముకొంటిని
నీవు నన్ను విడువనంటివే (2)
నా తోడుయు నీవే
నా నీడయు నీవే
నా తోడు నీడ నీవే యేసయ్యా (2) ||అందరు నన్ను||
నీవు నన్ను విడువనంటివే (2)
నా తల్లియు నీవే
నా తండ్రియు నీవే
నా తల్లి తండ్రి నీవే యేసయ్యా (2)
1. లోకము నన్ను విడచినా
నీవు నన్ను విడువనంటివే (2)
నా బంధువు నీవే
నా మిత్రుడ నీవే
నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా (2)
2. వ్యాధులు నన్ను చుట్టినా
బాధలు నన్ను ముట్టినా (2)
నా కొండయు నీవే
నా కోటయు నీవే
నా కొండ కోట నీవే యేసయ్యా (2)
3. నేను నిన్ను నమ్ముకొంటిని
నీవు నన్ను విడువనంటివే (2)
నా తోడుయు నీవే
నా నీడయు నీవే
నా తోడు నీడ నీవే యేసయ్యా (2) ||అందరు నన్ను||