సృష్టి ఆరంభం ఎలా జరిగింది

ఈ ప్రపంచంలోనే మానవ జనాభా మొత్తం కూడాను ఆదాము మరియు హవ్వ వారిద్వారే ఈ మానవ సృష్టి ప్రారంభం అయిందని బైబిల్ చెబుతుంది, ఇదే విధానాన్ని జూడో మరియు కురాన్ గ్రంధాలు కూడాను ఈ మానవ సృష్టి ఆదాము మరియు అవ్వ ద్వారానే జరిగిందని చెబుతున్నాయి, కానీ ఈ మూడు పవిత్ర గ్రంధాల మధ్య కొంతవరకు వ్యత్యాసం ఉంది, కానీ మనము బైబిల్ ని ప్రమాణికంగా చేసుకొని ఈ సృష్టి ఆరంభం గురించి తెలుసుకుందాం, పవిత్ర బైబిల్ గ్రంథంలోని ఆదికాండంలో ఈ విషయాలు సంబంధించి అంత కూడాను వివరించడం జరిగింది, వాటి గురించి మనం ఇప్పుడు ఇక్కడ  వివరాణాత్మకంగా తెలుసుకుందాం.

 ది క్రియేషన్ ఆఫ్ ది వరల్డ్

The beginning of creation,bible stories

 ప్రారంభంలో, బైబిల్ ప్రకారం, దేవుడు తప్ప మరేమీ లేడు.  దేవుడు విశ్వాన్ని సృష్టించాలని నిర్ణయించుకున్నాడు మరియు ఈ ప్రక్రియ ఆరు రోజులు పట్టింది.  ప్రతి రోజు, దేవుడు ప్రపంచంలోని వివిధ అంశాలను సృష్టించాడు:

 మొదటి రోజు: దేవుడు కాంతిని సృష్టించాడు మరియు చీకటి నుండి వేరు చేశాడు, పగలు మరియు రాత్రిని సృష్టించాడు.

 2వ రోజు: దేవుడు ఆకాశాన్ని సృష్టించాడు, పైన ఉన్న జలాలను దిగువ జలాల నుండి వేరు చేశాడు.

 3వ రోజు: దేవుడు సముద్రాలను సృష్టించడానికి దిగువ జలాలను సేకరించాడు మరియు పొడి భూమిని కనిపించడానికి అనుమతించాడు, వృక్షాలు, మొక్కలు మరియు చెట్లను భూమి మీద మొలిపించాడు.

 4వ రోజు: దేవుడు సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలను పగలు మరియు రాత్రిని పరిపాలించడానికి సృష్టించాడు మరియు రుతువులు, రోజులు మరియు సంవత్సరాలను గుర్తించడానికి సృష్టించాడు.

 5వ రోజు: దేవుడు సముద్రాలను చేపలు మరియు ఇతర జలచరాలతో నింపాడు మరియు ఆకాశంలో ఎగరడానికి పక్షులను సృష్టించాడు.

 6వ రోజు: దేవుడు భూమి జంతువులను సృష్టించాడు, ఆపై, ఒక క్లైమాక్స్ చర్యలో, దేవుడు తన రూపంలో మానవాళిని సృష్టించాడు.

 ఆడమ్ మరియు ఈవ్ యొక్క సృష్టి

 బైబిల్‌లో వివరించిన విధంగా మానవత్వం యొక్క సృష్టి ఈ కథనం యొక్క కేంద్ర బిందువు.  ఇది ఎలా జరిగిందో ఇక్కడ వివరించడం జరిగింది.

 ఆదం యొక్క సృష్టి: దేవుడు భూమి యొక్క మట్టి నుండి ఆడమ్‌ను రూపొందించాడు మరియు అతనిలో జీవ శ్వాసను నింపాడు, అతన్ని జీవుడిగా చేసాడు.  ఆదం దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడు మరియు ఏదేను వనములో ఉంచబడ్డాడు.

 హవ్వ యొక్క సృష్టి: దేవుడు ఆదంకు తగిన సహచరిణి అవసరమని చూశాడు, కాబట్టి దేవుడు ఆదాముకు గాఢమైన నిద్ర కలుగజేసే అతని పక్కటెముకలలో ఒకదానిని తీసి దాని నుండి దేవుడు అవ్వ ను చేశాడు, ఈ విధంగా ఆదాముకు సహచరునిగా దేవుడు హవ్వను సమకూర్చాడు.

 ఆదాము మరియు హవ్వ  ఎంతో ఆనందంగా  ఏదేను వనములో జీవించసాగారు, ఆ ఏదేను వనము పచ్చని చెట్లతో అన్ని సమృద్ధిగా ఉన్నటువంటి వనరులతో నిండి ఉన్నటువంటి  ఒక స్వర్గం, ప్రభువు తాను సృష్టించినటువంటి సమస్త జీవుల  పైన ఆదాము మరియు హవ్వకు ఆదిపత్యాన్ని ఇచ్చాడు.

 ఆ ఏదైనా తోటలో మంచి చెడులను తెలుపు చెట్టు ఒకటి ఆ తోట మధ్యలో నాటబడి ఉంది, ప్రభువైన ఆ యెహోవా దేవుడు ఆ తోటలోని సమస్త వృక్ష ఫలములను మీరు తినవచ్చును కానీ ఆ తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడులను  తెలియజేయు  వృక్ష పలమను మీరు ఎన్నటికీ కూడాను తినకూడదు, నా మాట కాదని మీరు  తినిన యెడల నిశ్చయముగా మీరు చచ్చేదరు అని చెప్పి దేవుడు వారికి ఆజ్ఞాపించెను.

 ఒక పాము( అనగా అపవాది)   ఆదాము లేని సమయం చూసి హవ్వ దగ్గరికి వచ్చి మీరు తోట మధ్య ఉంచబడినటువంటి ఆ మంచి చెడ్డలను తెలుపు వృక్షపలమును మీరు  తినిన యెడల మీరు ఎంతో యవ్వనంగా ఉంటారని, ఏవేవో మాయ మాటలు హవ్వకు ఆ పాము చెబుతుంది, ఆ మాటలు నమ్మినటువంటి హవ్వ  ఆ చెట్టు ఫలములలో కొన్ని కోసి తాను తిని ఆదాముకు కూడాను తినిపిస్తుంది అప్పుడు వారు తాము  దిగంపురులమై ఉన్నామని తెలుసుకొని, సిగ్గుతో పొదలచోటన ఉంటారు.

మరునాడు ప్రభువు ఆదాము హవ్వలను కలుసుకోవడానికి ఏదేని తోటలోనికి వచ్చినప్పుడు, ప్రభువు వారిని చూసి వారు సిగ్గుతో మరియు భయంతో చెట్ల పొదల చాటున ఉంటారు, అప్పుడు ప్రభువారు ఇలా అంటారు నేను తినకూడదని చెప్పినటువంటి  ఆ వృక్ష ఫలమును మీరు తిన్నారా అని వారిని అడుగుతారు, అప్పుడు ఆదాము, నీవు నాకు జతగా సమకూర్చినటువంటి ఈ హవ్వ తినమంటేనే నేను ఆ ఫలము తిన్నానని చెబుతాడు, అప్పుడు హవ్వ కూడాను ఆ పాము తినమంటేనే నేను తిన్నాను అని విన్నవిస్తుంది, అప్పుడు దేవుడు వారి మీద ఎంతో కోపగించి   ఏదేను తోటలో నుంచి వారిని బహిష్కరిస్తాడు. అలాగే ఆ పామును కూడాను దేవుడు శపించడం జరుగుతుంది.

ఈ విధంగా వారు ఈ భూమి మీదకి వచ్చి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడతారు వీరికి ఖయ్యును మరియు  హేబేలు అను ఇద్దరు కుమారులు పుడతారు వీరి జీవిత వృత్తాంతం కూడాను ఎన్నో మలుపులు తిరుగుతూ ఉంటుంది.

 ఈ విధంగా ప్రభు ఆజ్ఞను మీరటం ద్వారా ఆదాము మరియు హవ్వ నిత్యజీవాన్ని కోల్పోయి మరణాన్ని పొందుకున్నారు, వీరి జీవిత వృత్తాంతం ద్వారా ప్రభువు ఆజ్ఞను మనము ఎన్నటికీ కూడాను మీరా కూడదు,  ప్రభువు వద్దంటే వద్దు, కావాలి అంటే కావాలి అనే విధంగా మన జీవితం ఉండాలి.