ఆదిలో ఏమి లేనప్ప్పుడు నీవే ఉన్నావు యేసు నీవే ఉన్నావు
ఆదిలో ఏమి లేనప్ప్పుడు
నీవే ఉన్నావు యేసు నీవే ఉన్నావు
ఇప్పుడును ఎల్లప్పుడును
నీవే ఉన్నావు యేసు నీవే ఉన్నావు
వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను
రాత్రి కమ్మని పలుకగా రాత్రి కలిగెను
నీవు లేకుండా కలిగున్నవేమియు
కలుగలేదులే యేసు కలుగలేదులే
జలముల మధ్య విశాలము కలిగినప్పుడు
ఆ జలములు ఈ జలములు వేరుపరచినపుడు
ఆ విశాలముకు ఆకాశం అని పేరు పెట్టినప్పుడు
నీవే ఉన్నావు యేసు నీవే ఉన్నావు
విత్తనమిచ్చు చెట్లన్నియు మొలిపించితివి
ఫలమిచ్చు వృక్షములను మొలిపించితివి
సూర్య చంద్ర నక్షత్రములన్
చేసితివి కలుగచేసితివి
నీ స్వరూపమందు మమ్ములను సృజియించితివి
నీ ఊపిరిని జీవాత్మను మాకొసగితివి
పాప అపరాధములచేత చచ్చియుండగా
భువికి వచ్చితివి మము బ్రతికించితివి