ప్రభువైన యేసు వైపు చూస్తూ మనం పరుగెత్తుదాం

మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము (హెబ్రీ 12:2). దైవ భక్తిని గూర్చిన గొప్ప మర్మము  క్రీస్తు అనే వ్యక్తి సశరీరునిగా ప్రత్యక్షమగుటలో ఉందిగాని  క్రీస్తు సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను అనే సిద్ధాంతంలో లేదు. 1తిమోతి  3:16లో ఈ విషయం స్పష్టంగా తెలియజేయ బడింది. కాబట్టి అయన యొక్క శరీరమును పరిశీలించుట మరియు కనుగొనుట అనే సిద్ధాంతమును బట్టి మనము పరిశుద్ధ పరచబడం గానీ, ఆయనను వ్యక్తిగతంగా తెలుసుకొనుట ద్వారానే  పరిశుద్ధపరచబడతాం. 

ప్రభువైన యేసు వైపు చూస్తూ మనం పరుగెత్తుదాం ,christ news ,Bible verse, run for christ

ప్రభువైన యేసు వైపు చూస్తూ మనం పరుగెత్తుదాం 

మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము (హెబ్రీ 12:2). దైవ భక్తిని గూర్చిన గొప్ప మర్మము  క్రీస్తు అనే వ్యక్తి సశరీరునిగా ప్రత్యక్షమగుటలో ఉందిగాని  క్రీస్తు సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను అనే సిద్ధాంతంలో లేదు. 1తిమోతి  3:16లో ఈ విషయం స్పష్టంగా తెలియజేయ బడింది. కాబట్టి అయన యొక్క శరీరమును పరిశీలించుట మరియు కనుగొనుట అనే సిద్ధాంతమును బట్టి మనము పరిశుద్ధ పరచబడం గానీ, ఆయనను వ్యక్తిగతంగా తెలుసుకొనుట ద్వారానే  పరిశుద్ధపరచబడతాం. 

మనము స్వంతంగా ఎంత ప్రయాసపడినా పాప స్వభావము గల మన హృదయమును పవిత్రపరచుకోలేము. అటువంటి అద్భుతమైన మార్పు మనలో చోటు చేసుకోవడానికి దేవుడే మనలో పనిచేయాలి. పరిశుద్ధత (నిత్య జీవము) దేవుడిచ్చు బహుమానము. మన క్రియల ద్వారా ఎన్నటికీ  దానిని సాధించలేము (ఎఫెసీ 2:8). దేవుడు మాత్రమే మనలను సంపూర్ణంగా పరిశుద్ధ పరుస్తాడని  1 థెస్సలొనీక 5:23 ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ వచనములు తప్పని మనలో ఎవరమూ చెప్పము. అయినా కానీ, నేడు అనేకమంది విశ్వాసులు పరిశుద్దులగుటకు తమను తాము ద్వేషించుకుంటున్నట్లు మనము చూస్తున్నాము. 

అయ్యో, వారు పరిశుద్ధతను చేరుకోకుండా పరిసయ్యులు అగుచున్నారు. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 4:23లో ప్రస్తావించిన నిజమైన పరిశుద్ధత కేవలం యేసు నందు విశ్వాస ముంచుట ద్వారా మాత్రమే సాధించగలం. *యేసు వైపు  చూచుట ద్వారా మాత్రమే చేరుకోగలము. మనం కేవలం సిద్ధాంతమును మాత్రమే చూస్తే  నెమ్మదిగా మనం పరిసయ్యులవలే మారిపోతాము. యేసువైపు చూచుట అంటే ఏంటో హెబ్రీ 12:2లో స్పష్టంగా వివరించబడింది. 

ఈ భూమి మీద ప్రతి రోజూ సిలువను సహించి సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన  పాపము లేనివాడుగా ఉండెను (హెబ్రీ4:15) అని మొట్ట మొదటిగా ఆయనలో మనము చూస్తాము. ఆ విధంగా మనము ఆయన అడుగు జాడలలో నడచుటకు మరియు ఆయన వెనుక పరుగెత్తుటకు ఆయన మనకంటే ముందుగావెళ్ళాడు. రెండవదిగా, ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చొనుటను మనము చూస్తాము. ఆవిధంగా ఆయన మన కొరకు తండ్రికి విజ్ఞాపనచేసి మన శ్రమలో మరియు శోధనలలో  సహాయం చేస్తాడు. 

ప్రార్ధన

పరలోకపు తండ్రీ,  సిద్ధాంతము మమ్ములను రక్షించలేదని మేము తెలుసుకున్నాము. ఈ భూమి మీదకు వచ్చిన యేసుక్రీస్తు మీద విశ్వాసముంచి ఆయన అడుగు జాడలలో నడచుటయే మా పరిశుద్ధత. ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రీ, ఆమేన్.