అందరు మెచ్చిన అందాల తార

అందరు మెచ్చిన అందాల తార
Singer Ramya Behara
Composer Purushottam Babu
Music
Song WriterPurushottam Babu


అందరు మెచ్చిన అందాల తార
అవనికి తెచ్చెను వెలుగుల మేడ (2)
క్రిస్మస్.. హ్యాపీ క్రిస్మస్
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
క్రిస్మస్.. మెర్రి క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ||అందరు||

సృష్టికర్తయే మరియ తనయుడై
పశుల పాకలో పరుండినాడు (2)
నీతి జీవితం నీవు కోరగా
నీకై రక్షణ తెచ్చినాడు (2)
నీకై రక్షణ తెచ్చినాడు ||క్రిస్మస్||

ఇంటిని విడిచి తిరిగిన నాకై
ఎదురు చూపులే చూచినాడు (2)
తప్పును తెలిసి తిరిగి రాగా
క్షమియించి కృప చూపినాడు (2)
ఎన్నో వరములు ఇచ్చినాడు ||క్రిస్మస్||

పాత దినములు క్రొత్తవి చేసి
నీలో జీవము నింపుతాడు (2)
కటిక చీకటే వేకువ కాగా
అంబరమందు సంబరమాయే (2)
హృదయమునందు హాయి నేడు ||క్రిస్మస్||


అందరు మెచ్చిన అందాల తార