అందాల తార అరుదెంచె నాకై

అందాల తార అరుదెంచె నాకై అంబర వీధిలో
Singer మాసిలామని
Composer
Music
Song Writerమాసిలామని

అందాల తార అరుదెంచె నాకై అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్
ఆనందసంద్ర ముప్పొంగె నాలో అమరకాంతిలో
ఆది దేవుని జూడ ఆశింప మనసు పయనమైతిని               ||అందాల తార||

విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగ దోచెను
వింతైన శాంతి వర్షించె నాలో విజయపథమున
విశ్వాలనేలెడి దేవ కుమారుని వీక్షించు దీక్షతో
విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచున్         ||అందాల తార||

యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు
ఎరిగిన దారి తొలగిన వేళ యెదలో కృంగితి
యేసయ్యతార యెప్పటివోలె యెదురాయె త్రోవలో
ఎంతో యబ్బుర పడుచు విస్మయ మొందుచు యేగితి స్వామి కడకు      ||అందాల తార||

ప్రభు జన్మ స్ధలము పాకయేగాని పరలోక సౌధమే
బాలుని జూడ జీవితమంత పావనమాయెను
ప్రభుపాదపూజ దీవెనకాగ ప్రసరించె పుణ్యము
బ్రతుకే మందిరమాయె అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్థన           ||అందాల తార||


అందాల తార అరుదెంచె నాకై