చలి రాతిరి ఎదురు చూసే

చలి రాతిరి ఎదురు చూసే
Singer జాషువా షేక్
Composer
Music
Song Writerజాషువా షేక్

చలి రాతిరి ఎదురు చూసే
తూరుపేమో చుక్క చూపే
గొల్లలేమో పరుగునొచ్చె
దూతలేమో పొగడ వచ్చె
పుట్టాడు పుట్టాడురో రారాజు
మెస్సయ్యా పుట్టాడురో మన కోసం (2)

పశుల పాకలో పరమాత్ముడు
సల్లని సూపులోడు సక్కనోడు
ఆకాశమంత మనసున్నోడు
నీవెట్టివాడవైనా నెట్టివేయడు (2)
సంబరాలు సంబరాలురో
మన బ్రతుకుల్లో సంబరాలురో (2)            ||చలి||

చింతలెన్ని ఉన్నా చెంత చేరి
చేరదీయు వాడు ప్రేమగల్లవాడు
ఎవరు మరచినా నిన్ను మరవనన్న
మన దేవుడు గొప్ప గొప్పవాడు (2)
సంబరాలు సంబరాలురో
మన బ్రతుకుల్లో సంబరాలురో (2)            ||చలి||


చలి రాతిరి ఎదురు చూసే