ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా

ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా 

చిన్న బైబిల్ సందేశం:

ఇంతకాలం మనలను తన కృపలో కాపాడిన దేవుడు ఇకముందు కూడా మనలను విడిచిపెట్టడు. ఎన్నో కష్టాల మధ్య ఆయన మనకు తోడుగా నిలిచాడు. కాబట్టి గత కృపను జ్ఞాపకం చేసుకుంటూ, రాబోయే రోజులను విశ్వాసంతో దేవుని చేతుల్లో ఉంచుదాం. ఆయన కృపే మన బలం, ఆయన ప్రేమే మనకు ఆశ్రయం.🙏✨


Song Details

Language: Telugu

Category: Christian, New Year

ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా Lyrics

ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా (2)
ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా (2) ||ఇంత కాలం||

ఎన్ని ఏళ్ళు గడచినా – ఎన్ని తరాలు మారినా (2)
మారని వీడని ప్రేమే నీదయ్యా
మార్చిన నా జీవితం నీకే యేసయ్యా (2) ||ఇంత కాలం||

నీవు చేసిన మేలులు – తలచుకుందును అనుదినం (2)
నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా
వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా (2) ||ఇంత కాలం||