ఇంటి మీద నున్న ఒంటరి - Inti Meeda Nunna Ontari

ఇంటి మీద నున్న ఒంటరి 

ఇంటి మీదనున్న ఒంటరి పక్షిలా నీవు ఒంటరిగా ఉన్నానని అనుకోకు.

మనుషులు దూరమైనా, యేసయ్య నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు.

నీ కన్నీటిని ఆయన చూస్తున్నాడు, నీ ప్రార్థనను వింటున్నాడు.

నీవు ఒంటరివి కాదు… యేసయ్య నీతో ఉన్నాడు.

“నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను.”

— హెబ్రీయులకు 13:5.

Song Details

Singer: S P Bala subramanyam

Language: Telugu

Category: Christian

ఇంటి మీద నున్న ఒంటరి Lyrics

ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను
కన్నీటితో కృంగి పోతున్నాను (2)
నా యేసయ్యా నా బలమా (2)
నా దీన ప్రార్థన ఆలకించుమా ||ఇంటి మీద||

వెతకాని బాణమును చేయుచుండె గాయములు
అపవాది కోరలు కోరుచుండె ప్రాణమును – (2)
నీ బాలి పీఠము చెంత నాకు చోటునీయుమా (2)
ఆలకించుమా ఆదరించుమా (2) ||ఇంటి మీద||

తెలిసి తెలిసి చేసితిని ఎన్నెన్నో పాపములు
తరచి తరచి చూచినా తరగవు నా దోషములు – (2)
నీ ఆత్మను కోల్పోయిన దీనుడను నేను (2)
ఆలకించుమా ఆదరించుమా (2) ||ఇంటి మీద||